హైదరాబాద్: 28°C
క్రైమ్

రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

AP: తూ.గో జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గాదరాడ-కోరుకొండ మార్గంలో వేగంగా వెళ్తున్న ఒక బైక్ అదుపుతప్పి రహదారి పక్కన ఉన్న చెట్టును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద తీవ్రతకు బైక్‌పై ప్రయాణిస్తున్న ముగ్గురు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు.