హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రా జిల్లాలో అమర్‌నాథ్ యాత్రికులతో వెళ్తున్న ప్రైవేట్ బస్సు బోల్తా పడి 16 మంది గాయపడ్డారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. జమ్మూ నుంచి దెహ్రాదూన్‌కు 57 మంది ప్రయాణికులతో వెళ్తుండగా, డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
క్రైమ్
యాత్రికుల బస్సు బోల్తా.. 16 మందికి గాయాలు


