ASR: డుంబ్రిగుడ (M) ప్రత్యేక ఓటర్ల సవరణ, ధ్రువీకరణ ప్రక్రియ 98.5 శాతం పూర్తయిందని ప్రత్యేక అధికారి నందు తెలిపారు. మొత్తం 38,879 మంది ఓటర్లలో 33,575 మంది డిజిటలైజేషన్ పూర్తి చేసినట్లు చెప్పారు. క్షేత్రస్థాయి పరిశీలనలో మరణించిన, వేరే ప్రాంతాలకు వెళ్లిన, డూప్లికేట్ ఓట్లు కలిగిన 4,776 మందిని జాబితా నుంచి తొలగించినట్లు వెల్లడించారు.
వార్తలు
డుంబ్రిగుడలో ఓటర్ల ధ్రువీకరణ 98.5% పూర్తి


