హైదరాబాద్: 28°C
క్రీడలు

గంభీర్‌కు మునాఫ్ పటేల్ మద్దతు

హర్షిత్ రాణాను మూడు ఫార్మాట్లలో ఆడించడంపై కోచ్ గంభీర్‌పై వస్తున్న విమర్శలను మాజీ క్రికెటర్ మునాఫ్ పటేల్ తిప్పికొట్టాడు. 8వ స్థానంలో బ్యాటింగ్ చేయగల బౌలర్ టీమిండియాకు అవసరమని అన్నాడు. బుమ్రా, సిరాజ్, అర్ష్‌దీప్‌లకు ఆ సామర్థ్యం లేదని చెప్పాడు. లోయర్ ఆర్డర్‌లో పరుగులు రాబట్టేందుకే గంభీర్.. రాణా వైపు మొగ్గు చూపాడని అతడు సమర్థించాడు.