హైదరాబాద్: 28°C
క్రీడలు

111కు చేరిన ICC సభ్య దేశాలు

ఐసీసీ వార్షిక సదస్సులో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అమెరికా, కెనడాలపై సస్పెన్షన్‌ను కొనసాగించాలని నిర్ణయించారు. మారిషస్ క్రికెట్ ఫెడరేషన్‌కు కొత్తగా అసోసియేట్ సభ్యత్వం ఇవ్వడంతో ఐసీసీ మొత్తం సభ్యదేశాల సంఖ్య 111కు (12 పూర్తి, 99 అసోసియేట్) చేరింది. ఒలింపిక్స్ నేపథ్యంలో అమెరికా సభ్యత్వ పునరుద్ధరణపై తుది నిర్ణయాన్ని ఐసీసీ వాయిదా వేసింది.