హైదరాబాద్: 28°C
క్రైమ్

సీతాగొంది వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి

ADB: గుడిహత్నూర్ మండలంలోని సీతాగొంది జాతీయ రహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో జన్నారంకు చెందిన యువకుడు జాంగిర్ మృతి చెందారు. స్థానిక SI శ్రీకాంత్ తెలిపిన వివరాల ప్రకారం.. సోదరుడు అబ్దుల్ తో కలిసి ఆదిలాబాద్‌కు వెళుతుండగా లారీ ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగినట్టు వెల్లడించారు. అనంతరం రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ జాంగిర్ మరణించినట్లు తెలిపారు.