హైదరాబాద్: 28°C
క్రీడలు

స్టార్ క్రికెటర్ రిటైర్మెంట్

వెస్టిండీస్ మాజీ కెప్టెన్ జాసన్ హోల్డర్ వన్డే క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ విషయాన్ని విండీస్ హెడ్ కోచ్ డారెన్ సామీ ధృవీకరించాడు. అయితే, అతడు టీ20, టెస్టుల్లో కొనసాగుతాడని స్పష్టం చేశాడు. 2023లో హోల్డర్ తన చివరి వన్డే మ్యాచ్ ఆడాడు. ఈ ఫార్మాట్‌లో అతడు మొత్తం 138 మ్యాచ్‌లు ఆడి, 2237 పరుగులు చేశాడు. అంతేకాకుండా బౌలింగ్‌లో 159 వికెట్లు పడగొట్టాడు.