భార్యను హత్య చేశాడనే అభియోగాలపై ఆస్ట్రేలియాలో ప్రవాస భారతీయుడు శ్రీనివాస్‌పై కేసు నమోదైంది. జూలై 7న భార్య లావణ్యతో జరిగిన గొడవలో అతడు కత్తితో దాడి చేయగా ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఘటన సమయంలో ఇద్దరు పిల్లలు ఇంట్లోనే ఉన్నారు. పోలీసులు శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకుని శుక్రవారం కోర్టులో హాజరుపరిచారు. ఈ దంపతులు రెండేళ్ల క్రితమే ఆస్ట్రేలియాకు వచ్చారు.
క్రైమ్
భార్య హత్య.. ఆస్ట్రేలియాలో భారతీయుడి అరెస్టు


