హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు TETపై అవగాహన సదస్సు

శ్రీకాకుళం నగరం కొత్త రోడ్డు జంక్షన్ సమీపంలోని ఓ కళ్యాణ మండపంలో TETపై అవగాహన సదస్సు శనివారం నిర్వహించనున్నట్లు ప్రముఖ సైకాలజిస్టు, భౌతికశాస్త్ర లెక్చరర్ అంపోలు రాజేష్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయులతో పాటు B.Ed, D.Ed పూర్తి చేసిన నిరుద్యోగ అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.