AP: శ్రీకాకుళం(D) జలుమూరు(M) మర్రివలసలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గడ్డి మందు తాగి తల్లి, ఇద్దరు కుమార్తెలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. తీవ్ర అస్వస్థతకు గురైన వారిని బుడితి CHCకి తరలించగా.. తల్లి ముద్ద దాలప్పమ్మ (60) మార్గమధ్యలోనే మృతి చెందింది. కుమార్తెలు సరస్వతి, దాలమ్మలు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
క్రైమ్
గడ్డి మందు తాగి తల్లి, ఇద్దరు కుమార్తెల ఆత్మహత్య


