హైదరాబాద్: 28°C
క్రైమ్

విషాదం.. గుండెపోటుతో యువకుడు మృతి

TG: ఇటీవల వయస్సుతో సంబంధం లేకుండా గుండెపోటు మరణాలు పెరుగుతున్నాయి. నిర్మల్ జిల్లా సరిహద్దు మహారాష్ట్ర పాలజ్ గ్రామానికి చెందిన నరేష్ (24) గుండెపోటుతో మృతి చెందాడు. నాందేడ్‌లో మెడికల్ రిప్రజెంటేటివ్‌గా పనిచేస్తున్న నరేష్ మెడికల్ షాపు వద్ద షూస్ వేసుకుంటూ ఒక్కసారిగా కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు. యువకుడి ఆకస్మిక మరణం స్థానికంగా తీవ్ర విషాదం నింపింది.