హైదరాబాద్: 28°C
క్రీడలు

ఫైనల్‌కు దూసుకెళ్లిన 'ఈ' ఛాంపియన్స్‌

టీజీ20 లీగ్‌లో హైదరాబాద్ 'ఈ' ఛాంపియన్స్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. కరీంనగర్‌తో జరిగిన క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో ఘన విజయం సాధించింది. 158 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ 15.3 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను ఛేదించింది. అభిరథ్ రెడ్డి (82), వికాస్ రెడ్డి (45) పరుగులతో అదరగొట్టారు. ఫైనల్ మ్యాచ్‌లో ఖమ్మం, హైదరాబాదప జట్లు తలపడనున్నాయి.