హైదరాబాద్: 28°C
క్రీడలు

టీమిండియా ఓటములపై అజారుద్దీన్ విమర్శలు

టీమిండియా వరుస ఓటములపై మాజీ కెప్టెన్ అజారుద్దీన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. భారత ప్లేయర్లు IPL మైండ్ సెట్ నుంచి త్వరగా బయటపడాలన్నారు. ఇంగ్లండ్ గడ్డపై ప్రతి బంతినీ బౌండరీ బాదాలంటే కుదరదని, పరిస్థితులను బట్టి ఆడాలని సూచించారు. ఇంగ్లండ్ బౌలర్లు మన బలహీనతలను పసిగట్టారని వ్యాఖ్యానించారు. భారత ఆటగాళ్లు తమ తప్పుల నుంచి త్వరగా పాఠాలు నేర్చుకుంటారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.