హైదరాబాద్: 28°C
క్రీడలు

కన్నీటి వీడ్కోలు పలికిన అఫ్ఘాన్ క్రికెటర్లు

అఫ్ఘానిస్థాన్ మాజీ క్రికెటర్ షాపూర్ జద్రాన్ (38) అంత్యక్రియలు కాబూల్‌లోని ఈద్గా మసీదులో ముగిశాయి. జద్రాన్ అంతిమ యాత్రలో అఫ్ఘాన్ స్టార్ క్రికెటర్లు రషీద్ ఖాన్, మహ్మద్ నబీ కన్నీళ్లతో ఆయన శవపేటకను మోశారు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా, షాపూర్ జద్రాన్ 'HLH' అనే ప్రాణాంతకమైన వ్యాధితో బాధపడుతూ, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు.