హైదరాబాద్: 28°C
వ్యాపారం

మళ్లీ పెరిగిన ముడిచమురు ధరలు

అమెరికా-ఇరాన్ మధ్య మరోసారి ఉద్రిక్తతల నేపథ్యంలో ముడిచమురు ధరలు మరోసారి పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ధర 1.4 శాతం పెరిగింది. దీంతో బ్రెంట్ క్రూడ్ ధర 79 డాలర్లకు ఎగబాకింది. అలాగే వెస్ట్ టెక్సాస్ ఇంటర్నీడియట్ బ్యారెల్ ధర 74 డాలర్లకు చేరుకుంది. ఈ పెరుగుదల భారత్ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని  నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.