హైదరాబాద్: 28°C
వార్తలు

Friday Dry Day కార్యక్రమాలను నిర్వహించాలి: కలెక్టర్

WNP: డెంగ్యూ, మలేరియా వంటి దోమల ద్వారా వ్యాపించే వ్యాధులను నివారించేందుకు ప్రతి శుక్రవారం నిర్వహించే "ఫ్రైడే డ్రై డే" కార్యక్రమాలను అన్ని శాఖల అధికారులు సమన్వయంతో నిరంతరంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. ఇంటి పరిసరాలు తదితర ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండకుండా చర్యలు చేపట్టాలన్నారు. ఇంటింటికి వెళ్లి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.