WNP: వనపర్తి పట్టణం 24వ వార్డు బండారనగర్ ప్రాథమిక పాఠశాల వద్ద ఉన్న బోరు పైప్ లైన్ సమస్య ఏర్పడింది. లీకేజీ పైపు నుంచి నీరు వృథాగా పోతోంది. సమస్యపై పుర అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని కాలనీవాసులు వాపోతున్నారు. అసలే వర్షాకాలం వ్యాధులు వ్యాప్తిచెందే అవకాశం ఉందని, లీకేజీలు అరికట్టి సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు.
వార్తలు
పాఠశాలలో బోరు నీరు వృధా


