హైదరాబాద్: 28°C
వార్తలు

డ్రైనేజీలు నిర్మించాలని ఆర్జీ3 GMకు వినతి

PDPL: సెంటినరీ కాలనీ సీ-2 ప్రాంతంలో డ్రైనేజీలు నిర్మించాలని కోరుతూ రత్నాపూర్ సర్పంచ్ పల్లె ప్రతిమ ఆర్జీ-3 జీఎం మధుసూదన్‌కు వినతిపత్రం అందజేశారు. డ్రైనేజీలు లేక మురుగునీరు నిల్వ ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు. దీనిపై స్పందించిన జీఎం, డ్రైనేజీ నిర్మాణానికి అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కోరారు.