హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

తెల్లజుట్టు కనపడకుండా..!

తెల్లజుట్టును కవర్ చేయడానికి సహజ పద్ధతులు ఉత్తమం. గోరింటాకు, కాఫీ పొడి, ఉసిరి పొడిని కలిపి పేస్టులా చేసి జుట్టుకు పట్టించాలి. ఇది రసాయనాలు లేని సహజ రంగును ఇస్తుంది. తక్షణ పరిష్కారం కోసం 'హెయిర్ మస్కారా' లేదా 'రూట్ టచ్-అప్ స్ప్రే' వాడవచ్చు. అలాగే, విటమిన్ బి12, ఐరన్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం ద్వారా జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు.