హైదరాబాద్: 28°C
వార్తలు

'మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలి'

SRD: సిర్గాపూర్ మండలం వాసర్ పాఠశాలలో ఉపాధ్యాయులు, విద్యార్థులు కలిసి మొక్కలు బుధవారం నాటారు. అనంతరం మొక్కలకు నీళ్లు పోశారు. ఈ సందర్భంగా గణిత బోధకుడు రహీం మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని సూచించారు. అంతేకాకుండా నాటిన మొక్కను బాధ్యత తీసుకొని వాటిని పెంచాలన్నారు. మొక్కలను సంరక్షిస్తే అవి మనకు రక్షణ ఇస్తాయన్నారు.