హైదరాబాద్: 28°C
వ్యాపారం

ఆ మూడు సంస్థలకు 'FSSAI' నోటీసులు

ప్యాక్ చేసిన ఆహార ఉత్పత్తులపై తప్పుడు ప్రకటనలు చేస్తూ, కస్టమర్లను తప్పుదోవ పట్టిస్తున్న కంపెనీలపై భారత ఆహార భద్రత ప్రమాణాల సంస్థ 'FSSAI' కఠిన చర్యలకు దిగింది. నిబంధనలు ఉల్లంఘించినందుకు గానూ ప్రముఖ బ్రాండ్లు లోట్టే ఇండియా, ఫెర్న్స్ ఎన్ పెటల్స్, కుబేర ఫుడ్స్‌కు నోటీసులు జారీ చేసింది. తమపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో 7 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది.