AP: విశాఖ రుషికొండ భవనాలపై హైకోర్టులో దాఖలైన పిల్‌పై వాదనలు జరిగాయి. భవనాలను పర్యాటక వినియోగానికి ప్రతిపాదనలు ఆహ్వానించామని, అవి వచ్చాక మంత్రి వర్గ ఉపసంఘం నిర్ణయం తీసుకుంటుందని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. భవనాలను ఏ సంస్థకూ కేటాయించలేదని పేర్కొంది. వాదనలు విన్న కోర్టు పిటిషనర్ వేసిన అనుబంధ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణ వాయిదా వేసింది.
వార్తలు
రుషికొండ భవనాలపై హైకోర్టులో విచారణ


