తిరుమల శ్రీవారి ఆలయంలో ఈనెల 14న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, 17న వార్షిక ఆణివార ఆస్థానం వైభవంగా జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈనెల 14, 17 తేదీల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. అలాగే 17వ తేదీన నిర్వహించాల్సిన కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకరణ సేవలను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. భక్తులు ఈ మార్పులను గమనించాలని కోరారు.
భక్తి
తిరుమలలో వీఐపీ బ్రేక్, ఆర్జిత సేవలు రద్దు


