తిరుమలలో జూలై 14, 17 తేదీల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటన విడుదల చేసింది. జూలై 14న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, 17న శ్రీవారి ఆలయంలో ఆణివార ఆస్థానం కార్యక్రమాలు జరగనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. జూలై 13, 16 తేదీల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలకు సంబంధించిన సిఫార్సు లేఖలు స్వీకరించబోమని స్పష్టం చేసింది.
భక్తి
తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు


