హైదరాబాద్: 28°C
క్రైమ్

దుబాయ్‌లో ప్రమాదం.. భారత కార్మికులు మృతి

దుబాయ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో పలువురు భారతీయ కార్మికులు మృతిచెందారు. మరికొందరు గాయపడ్డారు. రోడ్డు మధ్యలో ఆగి ఉన్న ఓ ట్రక్కును మినీ బస్సు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు అక్కడి ఓ పోలీసు అధికారి తెలిపారు. ట్రక్కు రహదారిపై ఆగిపోవడంతో వెనకాలే వస్తున్న మినీ బస్సు దాన్ని ఢీకొంది. ఈ ప్రమాద ఘటనపై దుబాయ్‌లోని భారత కార్యాలయం సంతాపం వ్యక్తం చేసింది.