TG: టీజీ20 క్రికెట్ లీగ్ మెగా వేలానికి సర్వం సిద్ధమైంది. కాసేపట్లో రామోజీ ఫిల్మ్‌సిటీ వేదికగా ప్లేయర్ల వేలం జరగనుంది. తెలంగాణలోని వివిధ జిల్లాలకు చెందిన 1300 మంది క్రికెటర్లు వేలం కోసం పేర్లు నమోదు చేసుకున్నారు. ఒక్కో ఫ్రాంఛైజీ గరిష్టంగా 20 మంది క్రికెటర్లను ఎంచుకోవచ్చు. ఆటగాళ్ల కొనుగోలు కోసం ఒక్కో జట్టు గరిష్టంగా రూ.60 లక్షలు వెచ్చించవచ్చు.
క్రీడలు
కాసేపట్లో టీజీ20 క్రికెట్ లీగ్ మెగా వేలం


