హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

మామిడి పండు తింటే మొటిమలు వస్తాయా?

మామిడి పండు తింటే మొటిమలు వస్తాయని చాలా మంది అపోహపడుతుంటారు. అయితే వీటి వల్ల మొటిమలు రావని.. ఆరోగ్యానికి కూడా మంచిదని నిపుణులు చెబుతున్నారు. అయితే తొక్కలోని 'ఉరుషియోల్' వల్ల వచ్చే అలర్జీ దద్దుర్లను మొటిమలుగా పొరబడుతుంటారు. ఇది రాకుండా పండును శుభ్రంగా కడగాలట. అలాగే మామిడితో పాటు చక్కెర, పాలు, నూనె పదార్థాలు కలిపి ఎక్కువగా తీసుకోవడం వల్లే ముఖంపై మొటిమలు వస్తాయంటున్నారు.