క్రమం తప్పకుండా భోజనం చేసినా చాలామంది అలసటగా ఫీలవుతుంటారు. దీనికి జంక్ ఫుడ్స్, ఎనర్జీ డ్రింక్స్ ప్రధాన కారణం కావచ్చు. ఆ డ్రింక్స్ తాగిన వెంటనే తక్షణ శక్తిని ఇచ్చినట్లు అనిపించినా, రక్తంలో చక్కెర స్థాయిలను ఒక్కసారిగా మార్చేసి మరింత నీరసానికి గురిచేస్తాయి. రోజంతా ఉత్సాహంగా ఉండాలంటే తాజా పండ్లు, నట్స్, గుడ్లు, పప్పు ధాన్యాలు వంటి పోషకాహారాన్ని డైట్‌లో చేర్చుకోవాలి.
ఆరోగ్యం
ఎంత తిన్నా నీరసమేనా? కారణాలు ఇవే!


