హైదరాబాద్: 28°C
క్రీడలు

IPL ఫైనల్ తర్వాత ఘోర ప్రమాదం: క్లార్క్

IPL-2026 ఫైనల్ ముగిసిన తర్వాత తాను ఘోర ప్రమాదం బారినపడ్డానని ఆసీస్ మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ వెల్లడించాడు. అహ్మదాబాద్ స్టేడియం నుంచి విమానాశ్రయానికి వెళ్తుండగా ఆయన కారు ఓ ట్రక్కు కిందకు దూసుకెళ్లింది. నిద్రలో ఉన్న తనకు స్వల్ప గాయాలయ్యాయని, డ్రైవర్ కాలు విరిగిందని తెలిపాడు. దేవుడి దయ, భారత ప్రజల మంచితనం వల్లే సురక్షితంగా ఇంటికి చేరానంటూ క్లార్క్ పేర్కొన్నాడు.