హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

నరాల బలహీనత తగ్గించే చిట్కాలు

నరాల బలహీనతను కొన్ని చిట్కాలతో తగ్గించుకోవచ్చు. విటమిన్ B12, D, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉండే ఆకుకూరలు, డ్రై ఫ్రూట్స్, పాలు, చేపలను ఆహారంలో చేర్చుకోవాలి. రోజూ ఉదయం కాసేపు నడవడం, యోగా లేదా ధ్యానం చేయడం వల్ల నరాలకు రక్తప్రసరణ మెరుగవుతుంది. ప్రతిరోజూ 7-8 గంటల ప్రశాంతమైన నిద్ర నరాల ఒత్తిడిని తగ్గించి, వాటిని బలోపేతం చేస్తుంది. ధూమపానం, మద్యం అలవాట్లకు దూరంగా ఉండాలి.