హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

మెడ నొప్పిని తగ్గించే చిట్కాలు

కూర్చున్నప్పుడు వెన్ను, మెడను తిన్నగా ఉంచాలి. నొప్పి తీవ్రంగా ఉంటే ఐస్ ప్యాక్ లేదా వేడి నీటి కాపడం 15 నిమిషాలు పెట్టాలి. తలను మెల్లగా ఇరువైపులా తిప్పుతూ రోజూ తేలికపాటి మెడ వ్యాయామాలు చేయాలి. నిద్రించేటప్పుడు మెడకు సపోర్ట్ ఇచ్చేలా మరీ ఎత్తుగా లేని దిండును వాడాలి. సిస్టమ్ ముందు గంటల తరబడి కూర్చోకుండా ప్రతి 45 నిమిషాలకు ఒకసారి చిన్న బ్రేక్ తీసుకోవాలి.