హైదరాబాద్: 28°C
వార్తలు

పెనుకొండలో రాగుల కొనుగోలు కేంద్రం ప్రారంభం

సత్యసాయి: పెనుకొండ మార్కెట్ యార్డులో రాగుల కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ అధికారి యాదవ్ మాట్లాడుతూ.. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ పంటను ప్రభుత్వ మద్దతుతో విక్రయించుకోవాలని సూచించారు. రైతులకు పారదర్శకంగా సేవలు అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.