హైదరాబాద్: 28°C
క్రైమ్

BREAKING: ముగ్గురు సజీవదహనం

TG: నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ ఇంట్లో సిలిండర్ పేలడంతో ముగ్గురు సజీవదహనం అయ్యారు. కలాల్‌వాడలో ఇంట్లో నిద్రిస్తుండగా సిలిండర్ పేలింది. ఈ ప్రమాదంలో చంద్రమ్మ(50), లక్ష్మణ్(17), ప్రణతి(4) మరణించారు. షార్ట్‌సర్క్యూట్‌తో మంటలు చెలరేగి గ్యాస్ సిలిండర్ బ్లాస్ట్ అయింది. మంటలను అదుపు చేసి మృతదేహాలను అగ్నిమాపక సిబ్బంది బయటకు తీశారు.