హైదరాబాద్: 28°C
క్రైమ్

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల దుర్మరణం

BDK: దుమ్ముగూడెం మండలం చిన్నబండిరేవు ప్రధాన రోడ్డుపై బైక్-ట్రాక్టర్ ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. భద్రాచలం వైపు నుంచి వస్తున్న బైక్‌ను పర్ణశాల వైపు నుంచి వచ్చిన ట్రాక్టర్ ఢీకొట్టినట్లు స్థానికులు తెలిపారు. దీంతో బైక్‌పై ఉన్న చుంచు చరణ్ సాయి, సంతోష్ మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.