హైదరాబాద్: 28°C
క్రైమ్

బ్యాంకులో దుండగుడు హల్‌చల్

AP: విశాఖ ITI జంక్షన్‌లోని BOB బ్రాంచ్‌లో దారుణం జరిగింది. బ్యాంకు దోపిడీకి యత్నించిన ఓ దుండగుడు.. అడ్డుకున్న మేనేజర్ శివరామరాజు, క్యాషియర్ రమేష్‌లపై సుత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో మేనేజర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. నిందితుడు రవికుమార్.. మరో బ్రాంచ్‌లోనే ఉద్యోగిగా పనిచేస్తున్నట్లు గుర్తించారు.