హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎన్నికల సిబ్బందికి చాలీచాలని భోజనాలు

PPM: భామిని ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో శనివారం నిర్వహించిన పంచాయతీ ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రం వద్ద భోజన ఏర్పాట్లు సరిగా లేక సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేశారు. మధ్యాహ్నం భోజనానికి సరిపడా ఆహారం అందక సుమారు 70 నుంచి 80 మంది ఎండలోనే వేచి ఉండాల్సి వచ్చింది. దీంతో ఎంపీడీవో, ఎన్నికల అధికారిణి ఎస్.వసంతకుమారిని సిబ్బంది నిలదీశారు. చివరకు మధ్యాహ్నం 3 గంటలకు భోజనం అందించారు.