హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సుప్రీం కోర్టు న్యాయమూర్తిని కలిసిన కలెక్టర్

W.G: ఆకివీడు మండలం ఐ.భీమవరంలో మాజీ మంత్రి కనుమూరి బాపిరాజు స్వగృహానికి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సరస వెంకటనారాయణ భట్టి తన సతీమణితో కలిసి విచ్చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదివారం ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఆర్డీవో ప్రవీణ్ కుమార్ రెడ్డి, డీఎస్పీ రఘువీర్ విష్ణు తదితరులు పాల్గొన్నారు.