హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

14వ వార్డు సభ్యుడిగా సాయిబాబా విజయం

BPT: భట్టిప్రోలు గ్రామ పంచాయతీ 14వ వార్డు సభ్యుడిగా తూనుగుంట్ల సాయిబాబా 94 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. తనను గెలిపించిన ఓటర్లకు ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే, తన గెలుపునకు సహకరించిన బంధుమిత్రులు, కుటుంబ సభ్యుల కృషిని జన్మలో మరువలేనన్నారు. వార్డు అభివృద్దికి ఎల్లప్పుడూ తోడ్పడుతానని ఆయన పేర్కొన్నారు.