MDK: ఎంఎస్సీ జువాలజీలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించిన వెల్దుర్తి మండల కేంద్రానికి చెందిన మౌనిక బంగారు పతకం అందుకుంది. రైతు దంపతులు బోయిని రాములు, అనసూయల కుమార్తె అయిన ఆమె, ఈ నెల 28న జరిగిన కాకతీయ వర్సిటీ 24వ స్నాతకోత్సవంలో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ చేతుల మీదుగా పతకం స్వీకరించింది. మౌనికపై గ్రామస్తులు ప్రశంసలు కురిపించారు.
వార్తలు
గవర్నర్ చేతుల మీదుగా మౌనికకు బంగారు పతకం


