హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

48 ఓట్ల ఆధిక్యంతో సాహేరా భాను విజయం

ప్రకాశం: కంభం మండలంలోని హజరత్ గూడెం గ్రామ పంచాయతీలో టీడీపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి షేక్ సాహేరా భాను విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థిపై 48 ఓట్ల ఆదిక్యంతో గెలుపొందారు. దీంతో టీడీపీ శ్రేణులు, ఆమె మద్దతుదారులు హర్షం వ్యక్తం చేశారు. గెలుపొందిన సాహెరా భానుకు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు.