హైదరాబాద్: 28°C
తెలంగాణ

సొంత ఖర్చుతో రోడ్డుకు మరమ్మతులు

GDWL: రాజోలి మండలం వెంకటాపురం స్టేజి నుంచి మాన్రెడ్డి వరకు గుంతలు పడిన 10 కిలోమీటర్ల బీటీ రోడ్డుపై ప్రయాణానికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనిని గుర్తించిన మాన్రెడ్డికి చెందిన హసన్ సొంత డబ్బు రూ. 3 లక్షలతో ఆదివారం మరమ్మతు పనులు చేపట్టారు. దీంతో ఐదు గ్రామాల ప్రజలు ఆయన ఔదార్యంపై హర్షం వ్యక్తం చేస్తూ అభినందిస్తున్నారు.