హైదరాబాద్: 28°C
తెలంగాణ

పాఠశాల శతాబ్ది వేడుకల్లో మంత్రి పొంగులేటి

ఖమ్మంలోని శాంతినగర్ పాఠశాల అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తానని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు. 1927లో ప్రారంభమైన పాఠశాల శతాబ్ది ఉత్సవాలకు ఆదివారం ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఉపాధ్యాయుల విజ్ఞప్తి మేరకు త్వరలో 30 కంప్యూటర్లు అందిస్తామన్నారు. మరో ఇద్దరు మంత్రులతో కలిసి పాఠశాలకు అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తామని ప్రకటించారు.