BDK: మణుగూరులో మాజీ MLA రేగా కాంతారావు ఆధ్వర్యంలో ఆదివారం దీక్షా దివస్ నిర్వహించారు. తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించారు. ఎల్ఈడీ స్క్రీన్‌పై ఉద్యమ ఘట్టాలను ప్రదర్శించారు. కేసీఆర్ ఆమరణ దీక్ష తెలంగాణ సాధనలో కీలక మలుపని రేగా పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలనలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించారు. బీఆర్ఎస్ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ
మణుగూరులో ఘనంగా దీక్షా దివస్


