MDK: నార్సింగి మండల కేంద్రంలో సోమవారం ప్రజావాణి నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో తిరుపతిరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. వివిధ గ్రామాల ప్రజలు తమ సమస్యలను వినతిపత్రాల ద్వారా అధికారుల దృష్టికి తీసుకురావచ్చని చెప్పారు. అందిన ఫిర్యాదులను సంబంధిత శాఖల సమన్వయంతో పరిష్కరిస్తామని పేర్కొంటూ, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
తెలంగాణ
సమస్యల పరిష్కారానికి ప్రజావాణి: MPDO


