JGL: ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి ఈరోజు మొత్తం రూ.4,72,553 ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. భక్తుల దర్శనాలు, ప్రసాదాల కొనుగోళ్లు, అన్నదాన కార్యక్రమం ద్వారా వచ్చినట్లు తెలిపారు. టికెట్ల విక్రయం ద్వారా రూ.1,96,863, ప్రసాదాల విక్రయం ద్వారా అత్యధికంగా రూ.2,06,110 సమకూరింది. అదేవిధంగా అన్నదానం ద్వారా రూ.69,580 ఆదాయం వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు.
తెలంగాణ
ధర్మపురి ఆలయానికి రూ.4.72 లక్షల ఆదాయం


