హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నార్పలలో ప్రధాన పార్టీలకు షాక్

ATP: నార్పల మేజర్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి గవ్వల రమాదేవి విజయం సాధించారు. ఆదివారం జరిగిన రెండో విడత పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో ప్రధాన పార్టీల బలపరిచిన అభ్యర్థులకు షాక్ ఇస్తూ ఆమె గెలుపొందారు. రమాదేవి విజయంతో గ్రామంలోని ఆమె మద్దతుదారులు బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు.