హైదరాబాద్: 28°C
తెలంగాణ

చెంచు పెంటల్లో డిప్యూటీ సీఎం పర్యటన

NGKL: జిల్లాలోని నల్లమల అటవీ ప్రాంతంలోని చెంచు పెంటలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదివారం సందర్శించారు. బౌరాపూర్ భ్రమరాంబ ఆలయాన్ని దర్శించుకున్న ఆయన, ఆదివాసీలతో మాట్లాడి తాగునీరు, వైద్యం, జీవన స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అప్పాపూర్ ఆశ్రమ పాఠశాలను తనిఖీ చేసి మధ్యాహ్న భోజనం మెనూను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు.