హైదరాబాద్: 28°C
తెలంగాణ

హాల్‌టికెట్ పోయినా.. పరీక్షకు చేరిన విద్యార్థి

HYD: హాల్‌టికెట్ పోగొట్టుకున్న పరీక్షా అభ్యర్థికి OU పోలీసులు అండగా నిలిచి మానవత్వం చాటుకున్నారు. ఓయూ PS కానిస్టేబుల్ గణేశ్ వెంటనే హాల్‌టికెట్ డౌన్‌లోడ్ చేసి అందించారు. అంబర్‌పేట్ ఎస్సై వాసుదేవ్ రెడ్డి తన ద్విచక్ర వాహనాన్ని ఇచ్చి, అభ్యర్థిని సకాలంలో తార్నాకలోని పరీక్షా కేంద్రానికి చేర్చేలా సహకరించారు. పోలీసుల చొరవపై ప్రజలు ప్రశంసలు కురిపించారు.