హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నల్లగంగమ్మ ఆలయానికి రూ.2.66 లక్షల ఆదాయం

అన్నమయ్య జిల్లా సంబేపల్లి నల్లగంగమ్మ ఆలయంలో హుండీ లెక్కింపు చేపట్టగా రూ.2,66,430 ఆదాయం సమకూరినట్లు ఈవో దేవదాసు తెలిపారు. టెంకాయల విక్రయం, దుకాణాల వేలం ద్వారా మరో రూ.4,62,500 ఆదాయం వచ్చినట్లు వెల్లడించారు. జూన్ 11 నుంచి నవంబర్ 28 వరకు భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించి ఆలయ ఖాతాలో జమ చేశారు.