హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కౌంటింగ్ ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలి: రాజా

E.G: రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఓట్ల లెక్కింపులో YCP కౌంటింగ్ ఏజెంట్లు పూర్తి అప్రమత్తంగా ఉండాలని మాజీ MLA రాజా సూచించారు. బొమ్మూరులోని పార్టీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణతో కలిసి ఏజెంట్లతో సమావేశమయ్యారు. ప్రతి ఓటును నిశితంగా పరిశీలించి, వ్యత్యాసాలు కనిపిస్తే వెంటనే అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు.